Foods : హీరోయిన్లలాంటి చర్మపు మెరుపు కోసం ఈ ఆహారాలు తప్పనిసరి
కొంత మంది చర్మం చూడగానే ఎంతో నిగారింపుగా మెరుస్తూ ఉంటుంది. చూసే కొద్దీ చూడాలనిపించేట్లు ఉంటుంది. అలా హీరోయిన్లకు లాంటి చర్మ సౌందర్యం పొందాలంటే కొన్ని ఆహారాలను మనం రోజు వారీ తినాలి. అవేంటంటే...?
Foods For skin Beauty : పట్టులాంటి మృదువైన చర్మం కావాలన్నా, నిగారింపుతో ఉండే ముఖ సౌందర్యం కావాలన్నా, మిల మిల మెరిసే అందమైన ముఖ ఛాయ కావాలన్నా మనం దానికి సరిపడా పోషణ ఇవ్వాల్సిందే. అందుకని కొన్ని ఆహారాలను(Foods) తప్పనిసరిగా క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాల్సిందే. అప్పుడే అందమైన చర్మం(Beautiful skin) మన సొంతం అవుతుంది.
కొంత మందికి ముఖంపై మొటిమలు, మచ్చల్లాంటివి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి వారు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. పుల్లగా ఉండే సిట్రస్ పళ్లు అన్నింటిలోనూ ఇవి సమృద్ధిగా దొరుకుతాయి. గుమ్మడి కాయ, బొప్పాయి, యాపిల్, స్ట్రాబెరీ, పైనాపిల్, మిరియాలు తదితరాల్లో ముఖ సౌందర్యాన్ని ఇనుమడింప చేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల ఆక్సికరణ ఒత్తిడి తగ్గి ముఖంపై మచ్చలు, పొక్కుల్లాంటివి తగ్గుతాయి.
ఆరోగ్యకరమైన చర్మం(skin) కోసం మనం ఎప్పుడూ హైడ్రేటింగ్‌గా ఉండటం అనేది అత్యవసరం. తగినంత నీరు తాగుతూ ఉంటే చర్మం తొందరగా సాగే లక్షణాన్ని కోల్పోకుండా ఉంటుంది. అలాగే పాలు, పాల సంబంధిత పాదర్థాలు, ఓట్స్, కొబ్బరి, బాదంపాలు లాంటి వాటిని తాగుతూ ఉండాలి. వీటిలో ఉండే ప్రొటీన్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే పెరుగన్నం లాంటి ప్రోబయోటిక్ ఆహారాలను తరచుగా తీసుకుంటూ ఉండేందుకు ప్రయత్నించాలి. ప్రాసెస్డ్ ఆహారాలకు దూరంగా ఉండాలి.