ఇంటర్నెట్ మూవీ డాటా బేస్(IMDb)లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చూసిన ఇండియన్ స్టార్ల జాబితాలో దీపికా పదుకొనే మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో ఎవరెవరు ఉన్నారంటే..?
Deepika Padukone: బాలీవుడ్ నటి దీపికా పదుకొనే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2014 నుంచి 2024 వరకు గత దశాబ్ద కాలంలో ఐఎండీబీలో ఎక్కువ మంది చూసిన టాప్ ఇండియన్ స్టార్‌గా ఆమె మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ జాబితాను ఐఎండీబీ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. మొదటి స్థానంలో దీపిక(Deepika) ఉండగా, రెండో స్థానంలో షారూఖ్ ఖాన్, మూడో స్థానంలో అలియా భట్లు ఉన్నారు.
ఆ తర్వాతి స్థానాల్లో ఇర్ఫాన్ ఖాన్, అమీర్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సల్మాన్ ఖనా్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ల పేర్లు ఉన్నాయి. టాప్ టెన్ జాబితాలో దక్షిణాది నుంచి ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. ఇక ఈ ఐఎండీబీ(IMDb) లిస్ట్‌లో మొదటి స్థానాన్ని సంపాదించుకున్న దీపికా పదుకొనే బాలీవుడ్‌లోనూ టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న నటిగా గుర్తింపు పొందారు.
ఈ విషయమై దీపికా పదుకొనే(Deepika Padukone)మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను లెక్కించే ఈ లిస్టులో అగ్ర స్థానంలో ఉండటం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఐఎండీబీ(IMDb)కి చాలా క్రెడిబిలిటీ ఉందన్నారు. అలాంటి లిస్టులో తాను మొదటి స్థానంలో ఉండటం తనకు చాలా ప్రత్యేకం అంటూ చెప్పుకొచ్చారు. 2007లో సినిమా రంగంలోకి అడుగు పెట్టిన దీపిక ఇప్పుడు తెలుగులోనూ నటించారు. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ అనే సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఆమె నటించిన విషయం మనందరికీ తెలిసిందే.