»Notices To Actress Hema In Bangalore Rave Party Case
Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు నోటీసులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మొత్తం 130 మంది ఈ పార్టీలో పాల్గొనగా, 86 మందికి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ అని తేలడం సంచలనంగా మారింది.
Krishnaveni, not Hema, was caught in the crossfire!
Actress Hema: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాను ఈ పార్టీకి వెళ్లలేదని వీడియోలు పోస్ట్ చేసిన నటి హేమకు ఈ కేసులో బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మే 27 న సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) ఎదుట హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ పార్టీలో పాల్గొన్న మొత్తం 130 మంది ఈ పార్టీలో పాల్గొనగా, 86 మందికి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ అని తేలడం సంచలనంగా మారింది. అప్పటి వరకు నటి హేమ ఎంతో ధీమాగా వీడియోలు షేర్ చేసింది. తరువాత తన బ్లెడ్ షాంపిల్స్‌లో పాజీటీవ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనతో పాటు చిరంజీవి, కాంతి, రాజశేఖర్, సుజాత, వరుణ్ చౌదరి, అశీరాయ్, రిషి చౌదరి, ప్రసన్న, శివానీ జైశ్వాల్ తదితరులకు నోటీసులు జారీ చేశారు.
దోషులుగా తేలిన మొత్తం 86 మందికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. బెంగళూరు రేవ్ పార్టీ కేసును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారిలో ఇప్పటి వరకు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1 గా వాసు, A2 గా అరుణ్ కుమార్, A3 నాగబాబు, A4 రణధీర్ బాబు, A5 మహమ్మద్ అబూబాకర్, A6గా గోపాల్ రెడ్డిని నమోదు చేయగా A7గా 68 మంది యువకులు, A8గా 30 మంది యువతులను చేర్చారు. అందులో ఏ2 నిందితుడు అరుణ్‌ను శనివారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ పార్టీ గురించి అన్ని వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.