»Ktr There Is No Talk Of 2 Lakh Jobs That Congress Said
KTR: కాంగ్రెస్ చెప్పిన రెండు లక్షల ఉద్యోగాల మాటే లేదు?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అన్నారు. కానీ వాటి ఊసే లేదని కేటీఆర్ మండిపడ్డారు.
KTR: There is no talk of 2 lakh jobs that Congress said?
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అన్నారు. కానీ వాటి ఊసే లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను తెలిపారు. అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఓటేస్తామా? పదేళ్ల పాటు నిజాయితీగా పనిచేసిన బీఆర్ఎస్కు ఓటేస్తామా? అని తెలిపారు. ఎన్నికల హామీల్లో జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అన్నారు. కానీ వాటి గురించి కూడా ఏం లేదు.
ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు ఇచ్చానని రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఉద్యోగాలు ఇచ్చామని చెబితే మేం నమ్మేయాలా? మీ తరపున కొట్లాడాలి అంటే మాకు బలమివ్వాలని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల్లో ఐదేళ్ల అపఖ్యాతిని మూటకట్టుకుందన్నారు. కాంగ్రెస్‌కి ఓటేసి అనవసరంగా ఓటేశామని భావిస్తున్నారు. ఇకనైనా ఆలోచించి ఓటేయండి. ఎవరి వల్ల లాభం జరుగుతుందో వాళ్లకే ఓటేయండని తెలిపారు.