»Non Stick Cookware Are Non Stick Utensils Healthy Is It Safe
Non Stick Cookware: నాన్-స్టిక్ పాత్రలు ఆరోగ్యకరమా? సురక్షితమా?
మన పూర్వీకులు మట్టి పాత్రలు వాడేవారు, కానీ కాలక్రమేణా స్టీల్, అల్యూమినియం, నాన్-స్టిక్ వంటి పాత్రలు వాడకంలోకి వచ్చాయి.కానీ వాటి వల్ల వచ్చే సమస్యలు మీకు తెలుసా?
Non Stick Cookware: Are Non-Stick Utensils Healthy? Is it safe?
Non Stick Cookware: నాన్-స్టిక్ పాత్రలు చాలా సులభంగా ఉండటం వల్ల చాలా మంది వాటిని ఇష్టపడతారు. కానీ, ఇటీవల కాలంలో వీటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసుకోవడంతో చాలా మంది వాటిని వాడటం మానేస్తున్నారు. పూర్వం వాడే మట్టిపాత్రలను అందరూ మర్చిపోయారు. పోటీలు పడి మరీ నాన్ స్టిక్ పాత్రలను వాడుతున్నారు. కానీ.. వాటి వల్ల వచ్చే సమస్యలు తెలిస్తే మళ్లీ వాటిని ముట్టుకోరు. ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ఇటీవల జారీ చేసిన ఆహార మార్గదర్శకాల ప్రకారం, నాన్-స్టిక్ పాత్రల వాడకం గురించి ఈ విషయాలు తెలుసుకుందాం.
నాన్-స్టిక్ పాత్రల వాడకం వల్ల కలిగే ప్రమాదాలు విషపూరిత పొగలు:నాన్-స్టిక్ కోటింగ్లలో ఉపయోగించే రసాయనాలు అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసినప్పుడు విషపూరిత పొగలను విడుదల చేస్తాయి. ఈ పొగలు పీల్చుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. ఆహారంలో రసాయనాలు: నాన్-స్టిక్ కోటింగ్ల నుండి రసాయనాలు ఆహారంలోకి కలిసిపోయే అవకాశం ఉంది. ఈ రసాయనాలు జీర్ణ సమస్యలు, అలెర్జీలు వంటి సమస్యలకు దారితీస్తాయి.
నాన్-స్టిక్ పాత్రలను సురక్షితంగా ఎలా వాడాలి అధిక ఉష్ణోగ్రతలు మానుకోండి:నాన్-స్టిక్ పాత్రలను ఎప్పుడూ అధిక ఉష్ణోగ్రతల వద్ద వాడవద్దు. మీడియం లేదా తక్కువ మంట మీద వాడండి. గీతలు పడకుండా జాగ్రత్త వహించండి:నాన్-స్టిక్ పాత్రలపై గీతలు పడకుండా జాగ్రత్త వహించండి. గీతలు పడితే, కోటింగ్ దెబ్బతింటుంది మరియు రసాయనాలు ఆహారంలోకి కలిసిపోయే అవకాశం పెరుగుతుంది. పాత పాత్రలను మార్చండి:మీ నాన్-స్టిక్ పాత్రలు పాతబడిపోయినట్లు కనిపిస్తే లేదా కోటింగ్ దెబ్బతిన్నట్లు అనిపిస్తే వాటిని వెంటనే మార్చండి.
నాన్-స్టిక్ పాత్రలకు బదులుగా ఏమి వాడాలి మట్టి పాత్రలు:మట్టి పాత్రలు ఆరోగ్యకరమైనవి మరియు పర్యావరణ అనుకూలమైనవి. ఇవి ఆహారానికి రుచిని కూడా జోడిస్తాయి. స్టీల్ పాత్రలు:స్టీల్ పాత్రలు కూడా సురక్షితమైనవి. కానీ, కాస్త ఖర్చుతో కూడుకున్నవి. ఇత్తడి పాత్రలు: ఇత్తడి పాత్రలు కూడా ఆరోగ్యానికి మంచిది. ఇవి కూడా కాస్త ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవే కానీ.. చాలా సురక్షితం..