మాల్దీవులను సందర్శించే భారత పర్యటకుల సంఖ్య ప్రస్తుతం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. అయితే ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైసల్ విజ్ఞప్తి చేశారు.
India-Maldives: మాల్దీవులను సందర్శించే భారత పర్యటకుల సంఖ్య ప్రస్తుతం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. పూర్తిగా పర్యటకంపై ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైసల్ విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల మధ్య బంధం ఎంతో చారిత్రకమైనదని తెలిపారు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం భారత్తో కలిసి పనిచేయాలనుకుంటోందన్నారు.
మేం ఎప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తాం. మా ప్రజలతో పాటు ప్రభుత్వం భారతీయులకు ఘనస్వాగతం పలుకుతుంది. దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగం కావాలని పర్యటక మంత్రిగా భారతీయులను కోరుతున్నానని ఫైసల్ తెలిపారు. 2024 తొలి నాలుగు నెలల్లో భారత పర్యటకుల సంఖ్య దాదాపు 50 శాతం పడిపోయింది. మయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని తెలిపారు.
ప్రధాని మోదీ లక్షద్వీప్ దీవులను జనవరిలో సందర్శించారు. అక్కడ పర్యటక ఫొటోలను హైలైట్ చేస్తూ ఫొటోలు, వీడియోలు షేర్ చేయగా.. అనవసరంగా మాల్దీవుల మంత్రులు జోక్యం చేసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు వచ్చాయి. మాల్దీవులు వెళ్లాలనుకునే భారతీయులు వాళ్ల ప్రణాళికలను రద్దు చేసుకున్నారు. విమాన, హోటల్ బుకింగ్లు క్యాన్సిల్ చేసుకున్నారు. కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు ఆ దేశానికి తాత్కాలికంగా బుకింగ్లను కూడా నిలిపివేశాయి. దీంతో వాళ్ల పర్యటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది.