Prashant Verma: ప్రశాంత్ వర్మ PVCUలో సూపర్ ఛాన్స్!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తనకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసుకొని సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో PVCUలో సూపర్ ఛాన్స్ ఇస్తున్నట్టుగా ప్రకటించాడు.
Prashant Verma: ప్రజెంట్ ఉన్న టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో ప్రశాంత్ వర్మ కూడా ఒకడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ప్రశాంత్. ఇటీవల వచ్చిన హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సాలిడ్ హిట్ కొట్టాడు. ఏకంగా 350 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా జై హనుమాన్ చేస్తానని చెప్పి.. క్లైమాక్స్‌లో గూస్ బంప్స్ తెప్పించాడు. ప్రస్తుతం అనౌన్స్ అయిన సీక్వెల్స్‌లో జై హనుమాన్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు సినీ అభిమానులు. కానీ ఈ సినిమా వచ్చేలోపు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌తో రాక్షస అనే ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.
అయితే.. ప్రశాంత్ వర్మ మాత్రం తనకంటూ ఓ యూనివర్స్ క్రియేట్ చేసుకొని సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో.. ప్రతిభావంతులందరినీ తన పీవీసీయూలో చేరాల్సిందిగా ఓపెన్ ఆఫర్ ప్రకటించాడు. యువకులు మరియు ఔత్సాహిక సాంకేతిక నిపుణులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇదొక పెద్ద అవకాశం.. సూపర్ పవర్స్ గురించి మాట్లాడుకుందాం.. అంటూ ఓ పోస్ట్ చేశాడు. మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మీ ప్రత్యేక నైపుణ్యం ఏమిటి? అది స్పిన్నింగ్ కథలు, ఎడిటింగ్, నైపుణ్యం కలిగిన గ్రాఫిక్స్.. ఇలా ఏదైనా సరే, మీలో టాలెంట్ ఉంటే మాతో చేరండని అన్నాడు. అందుకోసం మీ పోర్ట్‌ఫోలియోలను “talent@thepvcu.com” కి పంపండి.. PVCUలో కలుద్దాం.. అని పోస్ట్ చేశాడు. కాబట్టి.. ఇలాంటి ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.