»Hanuman With Insulin Man Dressed Up As Lord Hanuman Holding Insulin
Hanuman : హనుమంతుడి చేతిలో ఇన్సులిన్.. ఆప్ నాయకులపై మండిపడుతున్న నెటిజన్లు
హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభా యాత్రలో హనుమంతుడి వేష ధారణలో ఉన్న ఓ వ్యక్తి చేతిలో ఇన్సులిన్ పట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నాడు. దీంతో పలువురు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Hanuman With Insulin: హనుమద్ జయంతి సందర్భంగా దిల్లీలో జరిగిన ఓ శోభా యాత్ర వివాదాస్పదం అవుతోంది. అక్కడి ఊరేగింపులో ఓ వ్యక్తి హనుమంతుడి వేషం వేసుకుని చేతిలో ఇన్సులిన్ సీసాలను పట్టుకుని నిలబడ్డాడు. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్, దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సైతం ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ఈ విషయమై హిందూత్వవాదులు, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ 320కి చేరడంతో వైద్యుల సూచన మేరకు ఇన్సులిన్ని అందజేశారు. అరవింద్ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇస్తే హనుమంతుడి చేతులో ఇన్సులిన్ పెట్టి శోభా యాత్ర చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.
#WATCH | Delhi Minister and AAP leader Saurabh Bharadwaj participated in Hanuman Jayanti Shobha Yatra today.
The shobha yatra had a man dressed up as Lord Hanuman with insulin in both his hands.