»Hanuman Jayanti Hanuman Is The Inspiration Megastar Chiranjeevi
Hanuman Jayanti: హనుమంతుడే అందరి స్పూర్తి.. చిరంజీవి
హనుమాన్ జయంతి సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇష్ట దైవం అంజనేయస్వామి కోసం ప్రత్యేక పోస్ట్ సోషల్ మీడియోడాలో పంచుకున్నారు.
Hanuman Jayanti Hanuman is the inspiration.. Megastar Chiranjeevi
Hanuman Jayanti: హనుమాన్ జయంతి సందర్భంగా ప్రముఖుల అందరూ విషేస్ చేస్తున్నారు. అయితే అంజనేయ స్వామిని అమితంగా ఇష్టపడే వారిలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారని తెలిసిందే. ఈ మేరకు ఈ ప్రత్యేకమైన రోజునా చిరంజీవి ప్రత్యేకమైన పోస్టుతో హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాని షూటింగ్లో భాగంగా ఇటీవల ఓ హనుమంతిడి విగ్రహం సోషల్ మీడియా వైరల్ అయింది. ఆ విగ్రహాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అని తెలిపారు. ఆ హనుమంతుడి అకుంఠిత దీక్ష , కార్యదక్షత, సూక్ష్మ బుద్ధి, ధైర్య సాహసాలు మనందరికీ ఎల్లపుడూ స్ఫూర్తి దాయకం అంటూ ఆయన అధికారిక ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఆయన షేర్ చేసిన హనుమంతుని ఫోటో వైరల్ అవుతుంది. చిరంజీవికి హనుమంతుడు అంటే ఎంత ఇష్టమో అందిరికీ తెలిసిదే. చిత్ర పరిశ్రమకు రాకముందు ఆయన పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్. తరువాత ఆయన అంటే ఇష్టంతో చిరంజీవిగా పేరు మార్చుకున్నారు. ఇక ప్రతీ సందర్భంలో ఆయన గురించి ప్రస్థావించడం చూస్తూనే ఉన్నాము. అందుకే హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి పోస్ట్ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆయన అభిమానులు సైతం హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. ఇక ఆయన నటిస్తున్న విశ్వంభర సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.