SRCL: పవర్ లూమ్ విద్యుత్ మగ్గాల పరిశ్రమకు అవసరమైన నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తామని, తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో వరుణ్ రెడ్డి పర్యటించి పవర్ లూమ్ విద్యుత్ మగ్గాల పరిశ్రమను ఆయన సందర్శించారు. క్షేత్ర స్థాయిలో మగ్గాల పనితీరును పరిశీలించారు.