»Chandrababu Jagan Cheated People By Not Fulfilling Promises
Chandrababu: హామీలను నెరవేర్చక జగన్ ప్రజలను మోసం చేశారు
సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలకు ఉపయోగపరంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో రైతుల సంక్షేమం గురించి, సీపీఎస్ రద్దు లేదని ఆరోపించారు.
Chandrababu: Jagan cheated people by not fulfilling promises
Chandrababu: సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలకు ఉపయోగపరంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో రైతుల సంక్షేమం గురించి, సీపీఎస్ రద్దు లేదని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కూడా ప్రకటించలేదు. భగవద్గీత, బైబిల్, ఖురాన్తో పోల్చిన జగన్ హామీలను నెరవేర్చక ప్రజలను మోసం చేశారన్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పిన జగన్ వాటిని గోదావరిలో కలిపారన్నారు. వైసీపీ పాలన రాతియుగమన్నారు.
అధికారంలోకి రాగానే మొదటి సంతకం డీఎస్సీపైనే ఉంటుందని చంద్రబాబు తెలిపారు. సైకో జగన్ ఈసారి ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మా సూపర్ సిక్స్ ముందుకు జగన్ మేనిఫెస్టో వెలవెలబోయిందన్నారు. మేనిఫెస్టోలో యువత, రైతులు, మహిళల గురించి ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. దోపిడి అంటే జగన్.. పేటీఎం బ్యాచ్ విలువలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. పెద్ద ఎత్తున అప్పులు చేసి నవరత్నాలు అన్నారని.. నవమోసాలు చేశాడని చంద్రబాబు విమర్శించారు.