Krunal Pandya: మరోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్యా
ఇండియన్ ఆల్‌రైండర్ రెండోసారి తండ్రి అయ్యాడు. క్రికెటర్ కృనాల్ పాండ్యా సతీమణీ పంఖురి శర్మ మగబిడ్డకు జన్మినించింది. ఈ విషయం సోషల్ మీడియో చెక్కర్లు కొడుతుంది.
Krunal Pandya: ఇండియన్ క్రికెటర్, ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా(Krunal Pandya) మరోసారి తండ్రయ్యాడు. కృనాల్ భార్య పంఖురి శర్మ (Pankhuri Sharma) ఇటీవలే మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇదివరకు తమకు ఒక కుమారుడు ఉన్నారు. రెండోసారి మరో మగబిడ్డ తమ కుటుంబంలోకి వచ్చినట్లు, ఆ చిన్నారి పేరు వాయు అని వాయు కృనాల్ పాండ్యా(Vayu Krunal Pandya) అనే క్యాప్సన్‌తో పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ పోస్టులో పాండ్యా, ఆయన భార్య పంఖురి తమ చంటిబిడ్డను ఎత్తుకుని, పక్కనే వారి పెద్ద కుమారుడు ఉన్నారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు షేర్ చేస్తున్నారు.
అలాగే కామెంట్లు కూడా పెడుతున్నారు. అయితే బాబు ఏప్రిల్ 21 వ తేదీన పెట్టినట్లు పాండ్యా తెలిపారు. దాంతో ఈ ఆల్‌రౌండర్‌కు తోటీ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. స్టార్ క్రికెటర్లు శిఖర్ ధావన్, దినేశ్ కార్తిక్‌లు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వాయు చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు, యాక్టీవ్‌గా ఉన్నట్లు పాండ్యా వివరించారు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 17 హుషారుగా సాగుతుంది. లక్నో ఫ్రాంచైజీ తరఫున ఆల్‌రౌండర్‌గా తన ప్రతిభను కనబరుస్తున్నారు.