తమన్నా చేస్తున్న సినిమాల్లో ఓదెల 2 చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి తమన్నా లుక్ రివీల్ చేయగా.. ఇప్పుడు మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో శివశక్తిగా తమన్నా అదిరిపోయే లుక్లో ఉంది.
Tamanna: మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓదెల 2’. బ్లాక్ బస్టర్ మూవీ ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి కొనసాగింపుగా ‘ఓదెల 2’ తెరకెక్కుతుంది. ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో హెబ్బా పటేల్ లీడ్ రోల్లో నటించగా.. ఓదెల 2లో మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాశీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మహా శివరాత్రి సందర్భంగా ఓం నమ: శివాయ అంటూ ఈ మూవీ నుంచి తమన్నా ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఇక ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తవడంతో, లేటెస్ట్గ్ఆ రెండో షెడ్యూల్ స్టార్ట్ చేశారు.
హైదరాబాదు, చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ షెడ్యూల్ షూట్ జరుగనుంది. 20-25 రోజుల పాటు ఈ షెడ్యూల్ చేయబడింది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇదే విషయాన్ని చెబుతూ.. తమన్నా శివశక్తి రూపంలోకి ఎలా మారిందని తెలియజేస్తూ.. తాజాగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే.. ఓదెల 2 మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అయినట్లుగా తెలియజేశారు.
ప్రస్తుత ఈ మేకింగ్ వీడియో గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఈ చిత్రాన్ని సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్, మధు క్రియేషన్స్ నిర్మిస్తుండగా.. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. కాంతార మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్తో గూస్బంప్స్ తెప్పించిన అజనీష్ లోక్నాథ్.. ఈ మూవీకి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. మరి తమన్నా ఈ సినిమాతో ఎలా మెప్పిస్తుందో చూడాలి.