»Water Melon How To Identify Adulterated Watermelon
Water Melon: కల్తీ పుచ్చకాయను గుర్తించడం ఎలా?
వేసవి కాలం వచ్చిందంటే ఎక్కువగా పుచ్చకాయలకు డిమాండ్ ఉంటుంది. అయితే ఈరోజుల్లో కొంతమంది లాభాలు ఆర్జించాలని కొన్ని రసాయనాలు కలుపుతుంటారు. ఇలాంటి పుచ్చకాయలు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి రసాయనాలు కలిపిన పుచ్చకాయను గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం.
Water Melon: How to identify adulterated watermelon?
Water Melon: పుచ్చకాయ ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో నీటి ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయలో క్యాన్సర్తో పోరాడే గుణాలు ఉంటాయి. గుండె, కళ్లకు చాలా మంచిది. అయితే ఇవి త్వరగా పండి, ఎక్కువ రోజులు పాడవకుండా ఉండటానికి రసాయనాలు కలుపుతారు. అలాగే పుచ్చకాయ లోపలి భాగం ఎర్రగా ఉండాలని వీటికి ఇంజెక్షన్లు కలుపుతారు. చూడటానికి చక్కగా ఉంటాయి. కానీ వీటికి రుచి ఉండదు. వీటిని సరిగ్గా గమనిస్తే రసాయనాలు కలిపారో లేదో తెలుసుకోవచ్చు. పుచ్చకాయను కట్ చేసినప్పుడు గుజ్జు పగిలిపోయి రంగుల్లో తేడా ఉంటుంది.
కోసినప్పుడు విడిపోత ఆ పుచ్చకాయలో కెమికల్ కంటెంట్ ఉన్నట్లే. అలాగే పుచ్చకాయ పండ్లపై తెల్లటి మచ్చలు కనిపిస్తే అది కల్తీ అనుకోవాలి. చేతులతో తాకితే పౌడర్ అంటుకుంటే వీటిని కొనవద్దు. రసాయనాల వల్ల పండిన పుచ్చకాయ గింజలు చాలా చిన్నవిగా ఉంటాయి. సహజంగా పండే పుచ్చకాయ గింజలు అయితే నల్లగా, పెద్దవిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు రక్తహీనత, మెదడు దెబ్బతినడం, సంతానోత్పత్తి తగ్గడం, క్రోమేట్ కడుపు సమస్యలు వస్తాయి. కాబట్టి సహజమైనవి ఏవో తెలుసుకుని పండ్లను కొనడం బెటర్.