NGKL: HYDలోని జి.ఎం.సి. బాలయోగి స్టేడియంలో సైబరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో జిల్లా పోలీసులు ప్రతిభ చాటారు. లాన్ టెన్నిస్ నాన్-గెజిటెడ్ అధికారుల టీమ్ ఈవెంట్లో జిల్లా జట్టు 3వ స్థానం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. విజేతలను ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.