క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాలో లిల్లీగా తన గ్లామర్‌తో అదరగొట్టేసింది అమ్ముడు. దీంతో ఇంకా కావాలంటొందట అనుపమా.
Anupama Parameswaran: మొన్నటి వరకు గ్లామర్ డోస్‌కు దూరంగా ఉన్న అనుపమా.. ఇక నుంచి అలా కాదని, టిల్లు స్క్వేర్ సినిమాతో గ్లామర్ గేట్లు మొత్తం ఎత్తేసింది. లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్స్‌తో రెచ్చిపోయింది. టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డతో కుర్రాళ్లను ఫిదా చేసింది. ఇక్కడి నుంచి కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తోంది అను. అంతేకాదు.. ఏదైనా చేయడానికి రెడీ అన్నట్టుగా ఉంది అమ్మడి వ్యవహారం. చివరగా అనుపమా నటించిన ఈగల్ సినిమా ప్లాప్ అయింది. తమిళంలో చేసిన సైరెన్ కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో.. టిల్లు స్క్వేర్ పై భారీ ఆశలు పెట్టుకుంది ఈ క్యూట్ బ్యూటీ. అందుకు తగ్గట్టే.. ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన అనుపమా.. కొత్త సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేయాలని అనుకుంటోందట.
టిల్లు సక్సెస్ జోష్‌లో చాలా ఆఫర్లు అమ్మడు ముందు క్యూ కట్టాయట. కానీ ఆ ఆఫర్లను వద్దని చెబుతోందట. ఇప్పటి వరకు అనుపమా చేసిన సినిమాలన్నీకూడా మీడియం రేంజ్ హీరోలతోనే. పైగా పారితోషికం కూడా కాస్త తక్కువే అందుకుంటోంది. అందుకే.. సాలిడ్ ఆఫర్ కోసం వెయిట్ చేస్తోందట. ఓ బడా సినిమా ఆఫర్ వస్తే పారితోషికం అమాంతం పెంచాలనే ఉద్దేశ్యంతో ఎదురు చూస్తోందట. తాను అనుకున్న ఆఫర్‌తో పాటు రెమ్యూనరేషన్ వచ్చే వరకు అనుపమ కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకునేలా లేదట. ఈసారి ఏది చేసిన పెద్దగానే చేయాలనే ఆలోచనలో ఉందట. కాబట్టి.. అమ్మడికి ఏ బడా హీరో ఛాన్స్ ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా.. ఇక నుంచి హాట్ అనుపమను చూడబోతున్నామనే చెప్పాలి.