AP: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. అమరావతికి చట్టబద్ధత కల్పించేలా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేలా సహకరించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ‘కేంద్రం చూపిన చొరవతో అమరావతి శాశ్వత రాజధానిగా నిలిచింది. కేంద్రం అందిస్తున్న మద్దతును రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.