TG: ట్రాన్స్జెండర్ల ఆర్థిక ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నైపుణ్య శిక్షణను ప్రారంభించింది. గచ్చిబౌలిలోని నిథమ్ (NITHM)లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దీనిని ప్రారంభించి.. కార్ డ్రైవింగ్, హోటల్ మేనేజ్మెంట్, డ్రోన్ పైలట్ వంటి రంగాల్లో 91 మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.17.72 లక్షలు కేటాయించింది.