SDPT: బాల సదనాన్ని జిల్లా జడ్జి సంతోష్ కుమార్ శనివారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్శనలో బాల సదన నిర్వాహకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.