కొంతమంది ఉదయం లేచిన తర్వాత పళ్లు తోముకోరు. దీనివల్ల కేవలం దుర్వాసన మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ దీనివల్ల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడించారు.
Cancer: కొంతమంది ఉదయం లేచిన తర్వాత పళ్లు తోముకోరు. దీనివల్ల కేవలం దుర్వాసన మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ దీనివల్ల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడించారు. ఉదయాన్నే సరిగ్గా బ్రష్ చేసుకోకపోతే పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఫ్రెడ్ హట్చిన్సన్ క్యాన్సర్ కేంద్రానికి చెందిన పరిశోధకులు 200 మంది పెద్ద పేగు క్యాన్సర్ బాధితులపై జరిపిన అధ్యయనంలో కీలక విషయాలు తెలిసాయి. పెద్ద పేగు క్యాన్సర్ బాధితుల్లో ఉన్న సగం కణతుల్లో దంతాల్లో ఉండే సూక్ష్మజీవులు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.
నోటిలో ఉండే సూక్ష్మజీవులు కడుపులోని కింది పేగుల వరకు వెళ్లి పేగు క్యాన్సర్కు దారితీస్తాయని తెలిపారు. పేగులో ఉన్నట్లే నోటిలో కూడా దాదాపు 700 రకాల సూక్ష్మజీవులు ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ప్రతిరోజు బ్రష్ చేసుకోకపోవడం వల్ల యువత ఎక్కువగా ఈ పేగు క్యాన్సర్కు బలిఅవుతున్నట్లు తెలుస్తోంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 19 లక్షల మంది పెద్దపేగు క్యాన్సర్ బారిన పడ్డారు. గత 15 ఏళ్లుగా 20-49 ఏళ్లు వయస్సు ఉన్న వారు కూడా పెద్దపేగు క్యాన్సర్ బారిన పడుతున్నారు.