»Vijay Devarakonda Who Will Save Vijay Devarakonda Who Gives A Hit
Vijay Devarakonda: ఇక.. విజయ్ దేవరకొండను కాపాడేదెవరు? హిట్ ఇచ్చేదవరు?
ఏ సినిమా రిలీజ్ అయినా సరే.. ఈసారి గట్టిగా కొడుతున్నామని చెబుతూ వస్తున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. కానీ కానీ.. తీరా సినిమా రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అవుతోంది. దీంతో ఇక విజయ్ దేవరకొండను కాపాడే దర్శకుడు ఎవరు? అనే చర్చ జరుగుతోంది.
Vijay Devarakonda: లైగర్ సినిమా విషయంలో పాన్ ఇండియా లెవల్లో విజయ్ దేవరకొండ చేసిన రచ్చకు ఓ రేంజ్లో ట్రోలింగ్ జరిగింది. ఒకవేళ ఆ సినిమా హిట్ అయి ఉంటే.. ఈపాటికే పాన్ ఇండియా హీరోగా సెటిల్ అయిపోయేవాడు రౌడీ. కానీ లైగర్ ఫ్లాప్ అవడంతో.. కాస్త తగ్గి ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్‌గా సినిమాలు చేస్తున్నాడు. ఖుషి సినిమాతో పర్వాలేదనిపించిన విజయ్ దేవరకొండ.. ఫ్యామిలీ స్టార్‌తో అయినా సాలిడ్ హిట్ కొడతాడని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. కాబట్టి.. ఖచ్చితంగా హిట్ అని చెప్పలేం.
ఒకవేళ ఫ్యామిలీ స్టార్ హిట్ అయినా కూడా పెద్దగా సాటిస్ఫై అవలేదు రౌడీ ఫ్యాన్స్. దీంతో విజయ్ దేవరకొండకు సాలిడ్ హిట్ ఇచ్చే డైరెక్టర్ ఎవరు? అనే చర్చ జరుగుతోంది. ఫ్యామిలీ స్టార్ తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా కమిట్ అయ్యాడు విజయ్. అయితే.. ఈ ప్రాజెక్ట్ రామ్ చరణ్ దగ్గరి నుంచి విజయ్ దగ్గరికి వచ్చింది. ఫ్యామిలీ స్టార్ కూడా నాగ చైతన్య నుంచి రౌడీ దగ్గరికి వచ్చింది. దీంతో.. గౌతమ్ సినిమా పై కూడా అనుమనాలున్నాయి. మరి రౌడీని సక్సెస్ ట్రాక్ ఎక్కించే డైరెక్టర్ ఎవరు? అంటే, రౌడీ ఫ్యాన్స్ చెప్పే మాట ఒక్కటే.
అర్జున్ రెడ్డితో రౌడీని స్టార్‌గా మార్చిన సందీప్ రెడ్డి వంగ అయితేనే.. విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ కొడతాడని అంటున్నారు. కానీ ఇప్పటికే స్పిరిట్, అనిమల్ పార్క్, అల్లు అర్జున్‌తో సినిమాలు అనౌన్స్ చేశాడు సందీప్. కాబట్టి ఇప్పట్లో ఈ కాంబో సెట్ అవదు. పోనీ.. సుకుమార్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ అయినా ఉందా? అంటే, రీసెంట్‌గానే రామ్ చరణ్‌తో సినిమా అనౌన్స్ చేశాడు సుక్కు. మరి నెక్స్ట్ రౌడీ సినిమాల పరిస్థితేంటి? సాలిడ్ హిట్ ఇచ్చే దర్శకుడెవరో చూడాలి.