బీసీల న్యాయమైన హక్కుల సాధనకై భారత చైతన్య యువజన బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఈనెల 11 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు బీసీవై పార్టీ జిల్లా కన్వీనర్ బుధవారపు బాలాజీ తెలిపారు. నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్లో జరిగిన సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.