శీతల పానీయాలు తాగడం వల్ల గ్యాస్ తగ్గుతుందని అనుకోవడం పొరపాటని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వీటిలోని చక్కెర, కెఫిన్ వల్ల ఆమ్లత్వం మరింత పెరుగుతుంది. కడుపు ఉబ్బరం తగ్గాలంటే కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. దీనికి బదులుగా చల్లని పాలు లేదా సోంపు గింజలు తీసుకుంటే గుండెల్లో మంట నుంచి ఉపశమనం లభిస్తుందని సూచిస్తున్నారు.