NRML: బాసర ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన సందర్భంగా ఏర్పాట్లను ఆయన, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తదితరులతో కలిసి పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.