Etala Rajender : రూ.2లక్షల రుణమాఫీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : ఈటల
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు 2 లక్షల మంది రైతుల పంట రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి, బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.
They are spewing poison on us. Etala Rajender sensational comments on KCR
Etala Rajender : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు 2 లక్షల మంది రైతుల పంట రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి, బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జరిగిన వార్డు సమావేశాల్లో ఈటల మాట్లాడారు. 2 లక్షల రైతుల రుణమాఫీని ఒకేసారి అమలు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు రూ. 2వేల పింఛనే సక్రమంగా ఇవ్వలేక.. అసలు కొన్ని నెలలు ఫించనే ఇవ్వలేదన్నారు. అలాంటిది నెలకు రూ.2500 ఆర్థిక సాయం, మహిళలకు రూ.4000 పింఛన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేని హామీలతో ప్రజలను మోసం చేస్తోందన్నారు.
రాష్ట్రంలోని సుమారు కోటిన్నర కోట్ల మంది మహిళలకు 2,500 ఇవ్వాల్సి ఉందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు అనుకూలంగా లేదన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ పరిష్కరించి అవినీతి రహిత సుస్థిర పాలన అందిస్తుందన్నారు. రామమందిరాన్ని నిర్మించారని, ఆర్టికల్ 370, ట్రిఫిల్ తలాక్ రద్దు చేశారని, కామన్ సివిల్ కోడ్ అమలులోకి తెచ్చారని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. రోడ్లు, గ్యాస్ కనెక్షన్లు, డిజిటల్ బ్యాంకింగ్, రైతులకు, మహిళలకు మౌలిక సదుపాయాలు వంటి అనేక సౌకర్యాలు మెరుగుపడ్డాయి. మరోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తామని, ఇందుకోసం మల్కాజ్గిరి ప్రజలు కూడా మోడీని బీజేపీ ఎంపీగా గెలిపించి ఆదరించాలని కోరారు.