టాలీవుడ్ ఎనర్జిటిక్ దర్శకుల్లో హరీష్ శంకర్ కూడా ఒకరు. లేట్ అయినా కూడా.. ఆడియెన్స్‌కు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి పెద్ద పీట వేస్తాడు హరీష్ శంకర్. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్‌తో యమా స్పీడ్ మీదున్నాడు హరీష్.
Harish Shankar: ప్రస్తుంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పాలిటిక్స్ కారణంగా సెట్స్ పై ఉన్న సినిమాలను కాస్త హోల్డ్‌లో పెట్టారు పవన్. అందులో హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఒకటి. ఎలక్షన్స్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేయనున్నాడు. రీసెంట్గా జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్‌ను హైలెట్ చేస్తూ రిలీజ్ అయిన ఉస్తాద్ గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. దీంతో ఉస్తాద్ పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అయితే.. ఉస్తాద్ తిరిగి సెట్స్ పైకి వెళ్లేలోపు మాస్ మహారాజా రవితేజతో మిస్టర్ బచ్చన్ కంప్లీట్ చేసేలా దూసుకుపోతున్నాడు హరీష్ శంకర్. మిరపకాయ్ కాంబో రిపీట్ చేస్తు.. మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నారు రవితేజ, హరీష్ శంకర్. ఇటీవలె ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే.. మిస్టర్ బచ్చన్ లేటెస్ట్ షెడ్యూల్‌ను లక్నోలో స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక.. ఈ షెడ్యూల్‌తో 50 శాతం సినిమా కంప్లీట్ అవుతుందట. దీంతో హరీష్ శంకర్ అనుకున్న సమయానికి మిస్టర్ బచ్చన్ షూటింగ్ కంప్లీట్ చేసి.. వీలైనంత త్వరగా సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకురావడం పక్కా. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌కు వీరాభిమానిగా నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో మాస్ రాజా ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.