ADB: కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని ఆదిలాబాద్ DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. ఇటీవల నూతనంగా నియమితులైన DCC ప్రధాన కార్యదర్శి మల్లెల కరుణాకర్‌ను పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో సర్పంచ్ రహీం, నాయకులు జైపాల్, ప్రవీణ్ తదితరులున్నారు.