CTR: ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు “హెల్మెట్ పెట్టు–బహుమతి పట్టు” కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్ ధరించిన వాహనదారులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తారు. ముఖ్య ట్రాఫిక్ కూడళ్ల వద్ద పోలీసులు ఇచ్చే స్లిప్పులు నింపి వివరాలు నమోదు చేయాలి. వారాంత, నెలసరి బహుమతులతో పాటు సర్టిఫికెట్లు, మెమెంటోలు కూడా ఇవ్వనున్నారు.