AP: మాజీ మంత్రి పేర్ని నాని పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ముఖ్యంగా కొల్లు రవీంద్రను, ACB గోపాలరావును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘నువ్వు తెలంగాణకు వెళ్లినా సరే, కేసీఆర్ కాళ్లు పట్టుకుని మరీ నీ అంతు చూస్తా’ అంటూ హెచ్చరికలు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది.