Gold Rate : స్వల్పంగా తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి
ఈ వారం మొదటి నుంచి బంగారం ధరలు ఒక రోజు తగ్గడం, ఒక రోజు పెరగడం అన్నట్లుగా ట్రెండ్ ఉంది. మరి శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.67,680 ఉండగా, శుక్రవారం నాటికి రూ.120 తగ్గి రూ.67,560కు చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ..67,560గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) గురువారం రూ.75,822 ఉండగా, శుక్రవారం నాటికి రూ.268 పెరిగి రూ.76,090కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర తగ్గింది. గురువారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2171 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 6 డాలర్లు తగ్గి కూడా 2165 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 25.02 డాలర్లుగా ఉంది.