BHPL: ఎంపేడు గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఇసంపల్లి హారిక, స్పెషల్ ఆఫీసర్ హరీష్‌లు సభకు హాజరయ్యారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నామని, ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.