Karisma Kapoor: స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. భర్త ఫ్రెండ్స్‌తో రాత్రంతా గడపాలంటూ..!
హీరోయిన్లకు ఎదురయ్యే చేదు అనుభవాలు అన్నీ ఇన్ని కావు. కెరీర్ స్టార్టింగ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌కి గురయ్యామని ఎందరో ముద్దుగుమ్మలు చెబుతునే ఉంటారు. అలాగే పెళ్లైనా తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు తప్పవని అంటుంటారు. తాజాగా బాలీవుడ్ వెటరన్ బ్యూటీ చేసిన కామెంట్స్ షాక్ ఇచ్చేలా ఉన్నాయి.
Karisma Kapoor: ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్ల లిస్ట్ తీస్తే.. కరిష్మా కపూర్ కూడా టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన కరిష్మా కపూర్.. 2003లో పెళ్లి చేసుకుంది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను పెళ్లాడింది. వీరికి ఇద్దరు సంతానం కలిగారు. పిల్లల పేర్లు సమీరా, కిరణ్. అయితే.. కొంతకాలం బాగానే కలిసి ఉన్న ఈ జంట మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో.. 2014లో విడాకులు ప్రకటించారు. ఫైనల్‌గా 2016లో కోర్టు నుంచి విడాకులు మంజూరయ్యాయి.
అక్కడి నుంచి పూర్తిగా సినిమాలు తగ్గించేసింది. కానీ ఇప్పుడు తిరిగి రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. ‘మర్డర్ ముబారక్’ అనే వెబ్ సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలో తన వైవాహిక జీవితానికి సంబంధించిన షాకింగ్ కామెంట్స్ చేసినట్టుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తన భర్తతో హనీమూన్‌కు వెళ్లినప్పుడు.. అతని ఫ్రెండ్స్‌తో రాత్రంతా గడపాలని ఒత్తిడి తీసుకొచ్చాడని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. తనను వేలానికి పెట్టి అమ్మేయాలని చూశాడని కన్నీళ్లు పెట్టుకుంది. కానీ, ఇలాంటి నీచమైన చర్యలకు నేను పాల్పడలేదు.. అతని పై ఎంతగానో సీరియస్ అయ్యాను.
అయినా కూడా.. నాతో పెళ్లి తర్వాత కూడా అతని మొదటి భార్యతో ఎఫైర్ కొనసాగించాడు. అతడు ఎలాంటివాడో ఢిల్లీ మొత్తానికి తెలుసు.. అతడి వేధింపులు భరించలేకే విడాకులు తీసుకున్నాను.. అంటూ కరిష్మా కపూర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారింది. అన్నట్టు.. కరిష్మా కపూర్, కరీనా కపూర్ అక్క చెల్లెలు అన్న సంగతి తెలిసిందే.