»Prabhas Prabhas Is The Top Place In The Top 10 Trending
Prabhas: టాప్ 10 ట్రెండింగ్‌లో ప్రభాస్‌దే టాప్ ప్లేస్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్లో మోత మోగిపోతుంది.
Prabhas: ప్రభాస్.. ఈ పేరు చెబితే పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది. ఫ్లాప్ టాక్‌తో కూడా వందల కోట్ల ఓపెనింగ్స్ రాబట్టగల ఏకైక హీరో ప్రభాస్. ఈ పాన్ ఇండియా కటౌట్ పై వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు మూవీ మేకర్స్. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే. నెక్స్ట్ రాబోతున్న కల్కి, స్పిరిట్ కూడా భారీ బడ్జెట్‌తో వస్తున్నాయి. ఇక ప్రభాస్ పేరిట ఉన్న రికార్డులు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.
ఇప్పటికీ బాహుబలి 2 రికార్డ్స్‌ను ఎవరు టచ్ చేయలేకపోయారు. చేస్తే ప్రభాస్.. లేదంటే రాజమౌళినే బాహుబలి రికార్డులు బద్దలు చేయాలి. ఇక ప్రభాస్ క్రేజ్ విషయానికొస్తే.. ఏకంగా ఖాన్ త్రయాన్ని సైతం భయపెట్టేలా ఉంటుంది. హిందీ మార్కెట్లో ఓ తెలుగు హీరోకి ఖాన్ త్రయానికి మించిన ఫాలోయింగ్ ఉందంటే మామూలు విషయం కాదు. అందుకే.. ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే ఇండియా వైడ్‌గా తన మారు మోగాల్సిందే. ముఖ్యంగా ప్రభాస్ దెబ్బకు సోషల్ మీడియా క్రాష్ అయిన సందర్బాలు కూడా ఉన్నాయి. ప్రభాస్ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చిన సోషల్ మీడియా షేక్ అయిపోతుంది.
లేటెస్ట్గా.. ట్విట్టర్ ట్రెండ్స్‌కి సంబంధించిన ఓ రిపోర్ట్ వచ్చింది. గత ఏడాది 2023 జనవరి 1 నుంచి 2024 జనవరి 1 వరకు ఉన్న రిపోర్ట్స్‌లో.. ఇండియన్ వైడ్‌గా టాప్ 10 ట్రెండింగ్ ట్యాగ్స్‌లో ట్రెండ్ అయిన ఒకే ఒక్క హీరోగా ప్రభాస్ నిలిచాడు. అలాగే.. గతేడాది వచ్చిన ‘ఆదిపురుష్’ సినిమా కూడా టాప్‌లో ఉంది. ఈ లెక్కన ఇండియా వైడ్‌గా ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.