»Allu Arjun Bunny Is Sick But The Shooting Is Not Over
Allu Arjun: బన్నీకి అనారోగ్యం.. అయినా షూటింగ్ అపలేదు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనారోగ్యం బారిన పడినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయినా కూడా మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప2.. ది రూల్ షూటింగ్ మాత్రం ఆపలేదు. ఇంతకీ పుష్ప2 షూటింగ్ ఎక్కడ జరుగుతోంది?
Allu Arjun: ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీ ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే.. సుకుమార్ పుష్ప 2 సినిమాని చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ వైజాగ్‌లో మొదలైంది. దీని కోసం అల్లు అర్జున్ విశాఖపట్నం చేరుకోగా.. అభిమానులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. మరో పక్క సుకుమార్ కూడా విశాఖపట్నం చేసుకున్నారు. అక్కడ షూటింగ్ వారం నుంచి పది రోజుల పాటు జరుగుతుందని యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. కానీ సడెన్‌గా హైదరాబాద్ వచ్చేశాడు బన్నీ.
అంతేకాదు.. హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో షూటింగ్ కూడా మొదలు పెట్టింది చిత్ర యూనిట్. అయితే.. వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిందా? అసలు బన్నీ ఉన్నట్టుండి వైజాగ్ నుంచి ఎందుకొచ్చేశాడు? అనేది అర్థం కాకుండా మారింది. కానీ అల్లు అర్జున్ అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. అందుకే హైదరాబాద్ చేరుకున్నట్లుగా చెబుతున్నారు. అయినా కూడా షూటింగ్ ఆపలేదు. ప్రస్తుతానికైతే వైజాగ్ షూట్‌కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. వైజాగ్ షెడ్యూల్‌ను మళ్లీ ఎప్పుడైనా పెట్టుకోవచ్చని.. ప్రస్తుతం హైదరాబాద్‌లో చేయాల్సిన కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి.. పుష్ప2 షూటింగ్‌కు బ్రేక్ పడలేదనే చెప్పాలి. ఇక.. పుష్ప 2 సినిమాని ఇండిపెండెన్స్ డే సందర్భంగా జనవరి 15వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే.. బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్ చేస్తున్నారు.