Rashmika Mandanna: ఒకే దెబ్బకు రష్మికకు మూడు పిట్టలు?
నేషనల్ క్రష్ రష్మికకు ఒకే దెబ్బకు మూడు పిట్టలు పడ్డట్టుగా ఉంది. అమ్మడి కెరీర్ పీక్స్‌లో ఉండగా.. ఒకేసారి మూడు సినిమాలకు ఓకె చేసిందట. దీంతో రష్మిక క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Rashmika Mandanna: ప్రస్తుతం రష్మిక క్రేజ్ ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. మూడు పువ్వులు ఆరు కాయలుగా దూసుకుపోతున్న రష్మిక కెరీర్.. ఇప్పుడు పీక్స్‌లో ఉంది. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్డమ్ అందుకుంది రష్మిక. ఆ తర్వాత వచ్చిన అనిమల్ సినిమాతో బాలీవుడ్లో దుమ్ముదులిపేసింది. నిజానికి.. అనిమల్ సినిమా కంటే ముందే హిందీలో గుడ్ బై, మిషన్ మజ్ను వంటి సినిమాలు చేసింది రష్మిక. కానీ ఈ సినిమాలు అమ్మడి బాలీవుడ్ కెరీర్‌కు ఏ మాత్రం కలిసి రాలేదు. కానీ అనిమల్ రిలీజ్ అయ్యాక.. నేషనల్ క్రష్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.
ప్రజెంట్ రష్మక చేతిలో పుష్ప2, కుబేర వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో పాటు.. ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో అనే లేడీ ఓరియేంటేడ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్లో రష్మికకు వరుస ఆఫర్స్ వస్తున్నాయట. లేటెస్ట్గా.. ఒకేసారి 3 హిందీ చిత్రాలకు సైన్ చేసినట్లు బి టౌన్ వర్గాల సమాచారం. ఈ సినిమాలతో రష్మిక బాలీవుడ్‌ని ఏలడం పక్కా అంటున్నారు. ఒకేసారి మూడు సినిమాలకు సైన్ చేసిందంటే.. ఖచ్చితంగా రష్మిక బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌజ్‌కు కమిట్ అయ్యే ఛాన్స్ ఉంది.
త్వరలోనే ఈ మూడు చిత్రాల వివరాలు బయటకి రానున్నాయి. ఇక.. అనిమల్ తర్వాత రష్మిక హిందీలో రెమ్యునరేషన్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. కానీ ఇటీవల.. ఇది నిజమైతే బాగుంటుందనే కామెంట్స్ చేసింది అమ్మడు. అయినా కూడా రష్మిక గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్టు టాక్ ఉంది. ఏదేమైనా.. ఒక దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టుగా.. రష్మిక ఖాతాలో అనిమల్ దెబ్బకు మూడు సినిమాలు పడ్డాయనే చెప్పాలి.