KDP: ప్రసిద్ధ గండి ఆంజనేయస్వామి క్షేత్రానికి విచ్చేసిన అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవికి వేంపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ రఘునాథరెడ్డి స్వాగతం పలికారు. న్యాయమూర్తి దంపతులను సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం న్యాయమూర్తి దంపతులు గండి ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. న్యాయమూర్తికి స్వామి వారి ఆశీర్వాదం అందించారు.