స్టార్ హీరోయిన్ సమంత చేసే కామెంట్స్ హాట్ టాపిక్ అవుతునే ఉంటాయి. లేటెస్ట్గా సామ్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శరీరానికి తగిలిన గాయాల కంటే.. అదె ఎక్కువ అంటూ చెప్పుకొచ్చింది అమ్మడు.
Samantha: ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆమె ఇప్పటివరకు ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా సైన్ చేయలేదు. చివరిగా శాకుంతలం, ఖుషి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సామ్. ఈ సినిమాల తర్వాత మరో ప్రాజెక్ట్ కమిట్ అవలేదు. కానీ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలోనే ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మధ్యే తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ పూర్తి చేసింది సమంత. ఇది తప్పితే.. సామ్ చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. అయితే.. సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్టు ప్రకటించిన సామ్.. ఇటీవలె ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించింది. కానీ ఇప్పటి వరకు తన నిర్మాణంలో వచ్చే సినిమా ఏంటనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఉంటే.. బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యతో ఓ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే.. మయో సైటిస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి విదేశాల్లో వెకేషన్‌కు వెళ్లిన సమంత.. సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో ఇంటరాక్ట్ అవుతునే ఉంది.
చదవండి:Srilila: వాటిని రెండు సార్లు రిజెక్ట్ చేసిన శ్రీలీల?
అలాగే అప్పుడప్పుడు ఫోటో షూట్‌తో పాటు.. ఇంటర్య్వూల్లో చేసే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్గా సామ్ ఒక ఇంటర్వ్యూలో సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మన మీద మనకున్న నమ్మకం చాలా గొప్ప వ్యక్తిగా ఎదగడానికి సహాయపడుతుంది.. కానీ నా 13 ఏళ్ల సినిమా కెరియర్లో చాలా అభద్రతాభావానికి గురవుతున్నాను.. అయితే ఆ విషయాన్ని తాను తెలుసుకున్న తర్వాత.. త్వరలోనే దాని నుంచి బయటకు వచ్చానని.. చెప్పుకొచ్చింది. అలాగే.. శరీరానికి తగిలిన గాయాల కంటే మనసుకు తగిలిన గాయం నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.. అంటూ సామ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.