MBNR: జడ్చర్ల డాక్టర్ బీ.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ముస్కాన్ బేగం, నీలోఫర్ బసేరి, ప్రియాంక అజీమ్ ప్రేమ్ జీ స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కుల ఆధారంగా ఎంపికైన వీరికి సంవత్సరానికి రూ.30,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి.సుకన్య విద్యార్థులను అభినందించారు.