WNP: వెంగలాయిపల్లిలో నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఒకవైపు మాత్రమే రోడ్డు వేసి మరోవైపు వదిలేయడంతో రాకపోకలు కష్టమయ్యాయి. సింగిల్ రోడ్డులో వాహనాల రాకపోకలకు సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రమాదాల భయం పెరుగుతోందని స్థానికులు ఇవాళ అంటున్నారు. అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.