CTR: పుంగనూరు మండలంలోని ప్రసన్నయ్య గారిపల్లెలో నూతనంగా నిర్మించిన శ్రీసీతాసమేత కోదండరామస్వామి ఆలయ ప్రారంభ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పెద్దిరెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్థులు నిర్మించిన ఆలయాన్ని పెద్దిరెడ్డి సందర్శించి పలు విషయాలపై చర్చించారు.