SKLM: శ్రీకాకుళం అర్బన్‌లో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రైల్వే గ్రూప్-డి ఉద్యోగాలకు సిద్ధమవుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. బీసీ విభాగం డైరెక్టర్ అనూ రాధ మాట్లాడుతూ.. 100 మందికి 2 నెలల పాటు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. పదో తరగతి మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.