»Good News For Pawan Kalyan Fans Harihara Veeramallu Update
Harihara Veeramallu ఆగిపోలేదు.. నిర్మాత క్రేజీ అప్డేట్
పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హరహర వీరమల్లు చిత్రం ఆగిపోయిందని అందరూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత ఏఎమ్ రత్నం మాటలు వైరల్‌గా మారాయి.
Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి(Krish Jaggerlamudi) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం హరహర వీరమల్లు(Harihara Veeramallu). సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికే రెండు సంవత్సరాలు దాటి పోయింది. అయినప్పటికీ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. దీనిపై నెట్టింట్లో చాలా పుకార్లు వస్తున్నాయి. సినిమా ఆగిపోయిందని, డైరెక్టర్ తప్పుకున్నాడని ఇలా అనేక పుకార్లు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం స్పందించారు. చిత్రం ఆగిపోలేదని త్వరలో మళ్లీ మొదలు పెడుతామని వెల్లడించారు.
పవన్ కల్యాణ్‌తో సినిమా చేసి డబ్బులు సంపాదించుకోవాలంటే 20 రోజుల్లు డేట్స్ తీసుకొని ఏ సినిమా తీసినా కలెక్షన్లు వస్తాయి అని, కానీ ఆయనతో తాను రూపొందించే చిత్రం ఎప్పటికీ గుర్తిండిపోవాలని అని పేర్కొన్నారు. ఖర్చుకు వెనకాడకుండా పిరియాడిక్ డ్రామ తెరకెక్కిస్తున్నామని వెల్లడించారు. ఇందులో పవన్ కల్యాణ్ అద్భుతంగా కనిపిస్తారని, ఆయన ఫ్యాన్స్ ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుందని తెలిపారు. అంతే కాదు పవన్ కల్యాణ్‌తో తెరకెక్కిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న అనేక ఊహాగానాలకు చెక్ పడింది. గతంలో కూడా ఆయన ఈ సినిమా గురించి స్పందిస్తూ.. సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్స్ కెనడా, యూఎస్, భారత్‌లో జరుగుతుందని క్వాలిటీ ఇవ్వడంపై ఫోకస్ పెట్టామని అందుకే సినిమా లేట్ అవుతుంది అని పేర్కొన్నారు. 17వ శతాబ్దానికి చెందిన పిరియాడిక్ కథలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నారు. ఈ కథలో పవన్ కల్యాన్ ఓ దారిదోపిడి దొంగగా కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.