NGKL: జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని శ్రీశైలం ప్రాజెక్టులో 835.3 అడుగుల నీటిమట్టం ఉన్నట్టు ప్రాజెక్టు అధికారులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రాజెక్టులోకి శుక్రవారం రాత్రికి 9,440 క్యూసెక్కుల నీటిమట్టం వస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు నుంచి 15,713 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.