SKLM: జగన్ రెడ్డి కంటే ఉత్తరాంధ్ర ఉద్దండులమని చెప్పుకునే బొత్స, ధర్మానలే పెద్ద పిచ్చోళ్లు అని తీవ్రస్థాయిలో మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. కోటబొమ్మాళిలో పింఛన్ల పంపిణీ అనంతరం ఆయన మాట్లాడారు. ధర్మాన వంటి వాళ్ళు సీనియర్ నాయకులమని చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్రం విడిపోతే తప్ప రాజధానులు మారవని కూడా తెలియదా అని ప్రశ్నించారు.