ATP: రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ మండలంలోని కురువల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆనంద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో సరైన రికార్డులు మెయింటైన్ చేయకపోవడంతో సంబంధిత అంగన్వాడీ వర్కర్‌పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. చిన్నపిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేలా చూడాలని సూచించారు.