ASR: డుంబ్రిగూడ మండలం సొవ్వ పంచాయితీ బిట్రగండ గ్రామంలో సీఐ హిమగిరి, ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని తనిఖీ చేసిన అనంతరం గ్రామ ప్రజలకు మహిళల భద్రత, గంజాయి నివారణ, రోడ్డు భద్రత, ఆన్లైన్ మోసాలు, నాటు సారా వంటి అంశాలపై అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.