HYD: హనుమాన్ జయంతి సందర్భంగా రేపు (ఏప్రిల్ 2) నగరంలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. శోభాయాత్రల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఈ ముందస్తు చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.