MHBD: పెద్దవంగర మండలంలోని పోచారం గ్రామ శివారు వాగుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు మా దృష్టికి వస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.