WNP: తెలంగాణలో సవరించిన మీ సేవ సర్వీస్ ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రతి కేంద్రంలో నూతన ‘సిటిజన్ చార్టర్’ ప్రదర్శించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీలే వసూలు చేయాలని జిల్లా మేనేజర్ వెంకటేశ్, టీజీటీఎన్డీఎం చంద్రకాంత్ రెడ్డి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.