VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని 13 వార్డులోని బీసీ కాలనీలో పిచ్చి మొక్కలు మొలిచి మురుగునీటి కాలువ దుర్వాసన వెదజల్లుతోంది. రాత్రిపూట మురుగునీటి నుంచి పాములు బయటకి వస్తున్నాయని, దోమల బెడద ఎక్కువై చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్య బారినపడుతున్నట్టు కాలనీవాసులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Tags :